Ghanta Chakrapani | హైదరాబాద్ : నాగచైతన్య – సమంత మధ్య విడాకులకు కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎక్స్ వేదికగా స్పందించారు. బాధ్యాతాయుతమైన స్థానంలో ఉండి.. ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చడం సరికాదన్నారు. మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పే అని ఆయన పేర్కొన్నారు.
ఆ సంగతి మీకెవరు చెప్పారు సురేఖ గారూ.? అని సురేఖను ఘంటా చక్రపాణి సూటిగా ప్రశ్నించారు. వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలు ఉన్నాయా? రాష్ట్రమంత్రిగా ఒక బాధ్యాతాయుతమైన స్థానం లో ఉన్న మీరే ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చి మాట్లాడితే ఎలా..? ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధ పడ్డారు. ఆ బాధ సహజమే, కానీ సాటి మహిళల్ని మీరే గౌరవించనప్పుడు అదే గౌరవాన్ని ఆశించడం అత్యాశే కదా! అని ఆయన అడిగారు.
మీరు మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలో, మీరంటే గిట్టని వాళ్ళో కాదు.. స్వయంగా మీ పార్టీ ఇలా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉంది. మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పే. అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడవద్దు అంటే కుదరదు. యధారాజా! తధా ప్రజ!! అని పేర్కొంటూ ఘంటా చక్రపాణి తన ట్వీట్‌ను ముగించారు.
ఆ సంగతి మీకెవరు చెప్పారు సురేఖ గారూ.? వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలు ఉన్నాయా? రాష్ట్రమంత్రిగా ఒక బాధ్యాతాయుతమైన స్థానం లో ఉన్న మీరే ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చి మాట్లాడితే ఎలా. ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధ పడ్డారు. ఆ బాధ సహజమే, కానీ… https://t.co/wZoR8Ro34B
— Prof. Chakrapani Ghanta (@GhantaC) October 2, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. హరీశ్‌రావు డిమాండ్
Nagarjuna | కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా : హీరో నాగార్జున
Prakash Raj | ఏంటీ సిగ్గులేని రాజకీయాలు..! కొండ సురేఖ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఫైర్..