Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను ఈ ట్వీట్‌కు జతపరిచారు హరీశ్‌రావు.
I condemn the derogatory statements made by Minister @IKondaSurekha garu and demand an unconditional apology. pic.twitter.com/YLtMQV70QY
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2024
హీరో నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అని ఆమె ఆరోపించారు. నాగచైతన్య, సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా..? అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున కూడా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కొండా సురేఖకు నాగార్జున హితవు పలికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున స్పష్టం చేశారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని కొండా సురేఖకు నాగార్జున పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Prakash Raj | ఏంటీ సిగ్గులేని రాజకీయాలు..! కొండ సురేఖ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఫైర్..
MLA Sabitha | సురేఖమ్మ.. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది : సబితా ఇంద్రారెడ్డి
YSR | సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? కొండా సురేఖపై వైఎస్సార్ ఫైర్