MLA Sabitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిరాధర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడడం బాధాకరమని ఆమె అన్నారు.
ఎక్స్ వేదికగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. మీరు(కొండా సురేఖ) చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరమని సబిత పేర్కొన్నారు.
సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి.. సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
@IKondaSurekha
సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. @KTRBRS గారి గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. Cont— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? ప్రశ్నించిన కేటీఆర్
YSR | సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? కొండా సురేఖపై వైఎస్సార్ ఫైర్
KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు లాంటిది : కేటీఆర్