KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
రేపు ఎల్బీనగర్లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తాం.. ఎవరైనా అడ్డు వస్తే ఏం చేయాలో అది చేస్తామని కేటీఆర్ అన్నారు. ఇక సూపర్ ధనిక మంత్రిపై దాడుల తర్వాత ఈడీ మౌనం ఎందుకు వహించింది..? ఐదు రోజులైనా ఈడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య బంధంలో ఇది ఒక నాటకమా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీ అనుమతి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపిస్తుండు. హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు? తెలంగాణలో చిన్నపిల్ల గాడు పిలిచినా సరే వస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? ప్రశ్నించిన కేటీఆర్
KTR | ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ : కేటీఆర్
KTR | కాంగ్రెస్ అమానవీయ పాలనపై ప్రస్తుత గాంధీలు స్పందించాలి.. కేటీఆర్ రిక్వెస్ట్