KTR | ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని తెలిపారు.
KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
మూసీ ప్రాజెక్టు కోసం డబ్బులు ఎక్కడ్నుంచి తెస్తారు..? అని కేటీఆర్ నిలదీశారు. మూసీపై రెండు, మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను అని తెలిపారు. మూసీ విషయంలో సీఎంకు, మంత్రులకు సయోధ్య ఉన్నట్లు లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లని ఎవరు చెప్పారని శ్రీధర్ బాబు అంటున్నారు. అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ సీఎం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు అని కేటీఆర్ విమర్శించారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ అనుమతి ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నారు. రాహుల్ వెనుకుండి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టును రాహుల్ చేపట్టారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ ఎక్కడున్నారు..? మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో త్వరలో బయటపెడుతా. కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు కావాలి.. కానీ బాధితుల కష్టాలు పట్టవా..? అని కేటీఆర్ నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | భగ్గుమన్న 317 జీవో బాధితులు.. న్యాయం చేయాలని గాంధీ భవన్ ఎదుట నిరసన
KTR | కాంగ్రెస్ అమానవీయ పాలనపై ప్రస్తుత గాంధీలు స్పందించాలి.. కేటీఆర్ రిక్వెస్ట్
Bathukamma | బతుకమ్మ పండుగపై కాంగ్రెస్ నిర్లక్ష్యం.. కనీస ఏర్పాట్లు చేయని ప్రభుత్వం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

