Telangana | హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి వస్తే జీవో 317 సమస్యను పరిష్కరిస్తామని, దాన్ని రద్దు చేస్తామని నిరుడు అక్టోబర్ 2న పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన 317 జీవోపై మంత్రి వర్గ సంఘం కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయి పూర్తి వివరాలను సేకరించింది. పలుమార్లు సబ్‌కమిటీ భేటీలు నిర్వహించినా ఇంతవరకు ఏదీ తేల్చలేదు. ఈ కాలయాపనను జీర్ణించుకోలేకపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టేందుకే సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మాకు న్యాయం చేయాలంటూ గాంధీ భవన్ వద్ద 317జీవో బాధితుల నిరసన pic.twitter.com/YtbeGGSvnO
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024