KTR | కాంగ్రెస్ అమానవీయ పాలనపై ప్రస్తుత గాంధీలు స్పందించాలి.. కేటీఆర్ రిక్వెస్ట్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్ర పటానికి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేల్కొలిపిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అని కొనియాడారు. నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని అన్నారు.
సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం, వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ గారు స్వయంగా చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని పేదలు బాధపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అమానవీయ పాలనపై ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు స్పందించాలని కోరారు. డీపీఆర్ లేకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలను విరమింపజేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై మానవత్వంతో ముందడుగు వేయాలన్నారు.
సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం, వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ గారు స్వయంగా చెప్పారు.
ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది.
– బీఆర్ఎస్… pic.twitter.com/Hgd0ulSdAJ
— BRS Party (@BRSparty) October 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- gandhi jayanti
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

