Prakash Raj | తెలంగాణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా..? అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ, బాధ్యతగల మంత్రి స్థానంలో కొనసాగుతున్న కొండా సురేఖ.. కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులకు కారణమని.. సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని.. హీరోయిన్లకు మద్దతు పదార్థాలు అలవాటు చేశారంటూ అడ్డగోలు ఆరోపణ చేశారు.
రాజకీయాల్లో కొనసాగుతూ.. సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను రాజకీయాల్లోకి లాగారు. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. ఇటీవల మంత్రి సురేఖ మెడలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు నూలు దండ వేశారు. అయితే, దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా.. మీడియా సమావేశంలో చిల్లర కామెంట్లు చేస్తారా? అంటూ మంత్రి మండిపడింది. మహిళ అని చూడకుండా మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి సురేఖ బాధపడిపోయింది. సమంత, నాగచైతన్య జంట విడాకులను.. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్ల రాజకీయాల్లోకి లాగుతూ మంత్రి కొండా సురేఖ ఎలా సమర్థించుకుంటారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, హైడ్రా డ్రామాను పక్కదారి పట్టించేందుకు వికృత రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024