Nagarjuna | హైదరాబాద్ : తన కుటుంబ సభ్యుల పట్ల నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హీరో నాగార్జున పేర్కొన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కొండా సురేఖకు హితవు పలికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున స్పష్టం చేశారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని కొండా సురేఖకు నాగార్జున పేర్కొన్నారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? ప్రశ్నించిన కేటీఆర్
MLA Sabitha | సురేఖమ్మ.. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది : సబితా ఇంద్రారెడ్డి
YSR | సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? కొండా సురేఖపై వైఎస్సార్ ఫైర్