Padi Kaushik Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా నియామకమైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాగానే ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గాంధీ గారూ మీకు నేను ఓపెన్ బంపరాఫర్ ఇస్తున్నా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని మీరు అంటున్నారు కదా..? రేపు పొద్దున్న 11 గంటలకు మీ ఇంటికి వస్తాను. బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకుని, నీ ఇంటి మీద ఇద్దరం కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దాం.. మళ్లీ నువ్వు, నేను, వివేకానంద ముగ్గురం కలిసి బీఆర్ఎస్ భవన్కు వచ్చి ప్రెస్ మీట్ పెడుదాం. దీనికి సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి తెలియజేస్తున్నాను అని నిన్న రాత్రి పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?
గాంధీకి BRS కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి.. కౌశిక్ ఇంటి ముందు పోలీస్ బందోబస్తు https://t.co/lj6EZWETqA pic.twitter.com/MuEFz196hg
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | కోర్టుకెళ్లినా వదలం కూల్చేసుడే.. ఆక్రమణదారులెవరైనా హైడ్రా వదలిపెట్టదు
కలికి మేడ భద్రం.. పేద బతుకు ఛిద్రం.. ‘హైడ్రా’మాలో సామాన్యులే సమిధలు!