KTR | రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్లో నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభం నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని.. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు.
కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని…పారిశుద్ధ్య నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి…ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదని కేటీఆర్ అన్నారు.
ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది..
గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయనం గాని సంక్షోభంలోకి నెడుతూ.. మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను… ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ సవాలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున చేసుకోవాల్సిన ఏర్పాట్లను ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు తెలియజేశారు. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని.. ఇదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పలు అంశాలపైన నేతలకు దిశా నిర్దేశం చేశారు. కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని హరీష్ రావు సూచించారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన పలు అంశాలను హరీష్ రావు నేతలకు వివరించారు.
ఈ సమావేశాల సందర్భంగా ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని పార్టీకి అనుకూల వాతావరణ ఉన్నదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.


✳️ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం ఖాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
✳️ రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభం నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది
✳️ రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పట్టణాలకు ఇవ్వని ఏకైక… pic.twitter.com/10vNuLrrux
— BRS Party (@BRSparty) January 10, 2026