వరంగల్ : ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ (Panchayat Raj AE) ఏసీబీకి(ACB) పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం అనుమతి కోసంమండలానికి చెందిన పీఆర్ ఏఈ రమేష్‌ను కలిశాడు. అందుకు ఏఈ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం హనుమకొండ సుబేదారిలో బాధితుడి నుంచి పది వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
YouTuber Ranveer Allahabadia | స్టాండప్ కామెడీ పేరుతో అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేసు నమోదు
Fire Accident | దివాన్ దేవిడిలో ఘోర అగ్ని ప్రమాదం.. రూ.60కోట్ల ఆస్తి బుగ్గిపాలు..!