YouTuber Ranveer Allahabadia | స్టాండప్ కామెడీ పేరుతో అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేసు నమోదు
Ranveer Allahabadia | స్టాండప్ కామెడీ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందీ యూట్యూబర్‌పై కేసు నమోదు అయ్యింది.
YouTuber Ranveer Allahabadia | స్టాండప్ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందీ యూట్యూబర్‌పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ రణవీర్ అలహాబాడియా గురించి పరిచయం అవసరం లేదు. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ది రణవీర్ షో అనే పాడ్‌కాస్ట్ రన్ చేస్తూ ఉంటాడు.
అయితే రణవీర్ తాజాగా ఇండియాస్ గాట్ లేటెంట్ (Indias Got Latent) అనే స్టాండప్ కామెడీ షోకి హాజరయ్యాడు. ఇందులో రణవీర్‌తో పాటు స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజా కూడా ఉన్నారు. అయితే ఈ షోలో రణవీర్ మాట్లాడుతూ.. చెప్పలేని విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు పెద్ద దూమారాన్ని లేపాయి. అయితే ఈ విషయంపై తాజాగా రణవీర్ అలహాబాడియాతో పాటు సమయ్ రైనా, అపూర్వ ముఖిజాలపై కేసు నమోదు అయ్యింది. షోలో అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ముంబై కమిషనర్‌తో పాటు మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన ముంబై కమిషనరేట్ అతడిపై కేసు నమోదు చేసింది.
I met Ranveer at a cafe in Dharamshala on August 13th, he was with his girlfriend.
A few people came to the cafe to felicitate him.
So much fame at such a young age, has got the better of him.
Hope no one goes to his podcast show ever again.
Bad example.#RanveerAllahbadia pic.twitter.com/GLerbEFnL9— Shajan Samuel (@IamShajanSamuel) February 9, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

