హైదరాబాద్ : మహిళలపై దాడులు(Attacks on women) రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండలో జరుగుతున్న సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు హాజరై ఆయన మాట్లాడారు. దేశంలో మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. అలాగే పశిమ బెంగాల్లో వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి ఘటనను సీఎం మమతా బెనర్జీ వైఫల్యంగా చూస్తామన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని చెప్పారు. కాగా, ఆ పార్టీ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.
Also Read..