తిరుపతి : తిరుపతి శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఓ ప్రేమ జంట(Love couple) ఆత్మాహత్యాయత్నానికి (Suicide attempt) పాల్పడింది. చిత్తూరు నగరం బంగారురెడ్డిపాలేనికి చెందిన సతీష్, రాధిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు శుక్రవారం శ్రీవారిమెట్టు నడకమార్గం 450వ మెట్టు వద్ద పురుగుల మందు తాగారు.
గమనించిన భక్తులు టీటీడీ సెక్యూరిటీకి సమాచారం అందించడంతో వారు హుటాహుటినా అక్కడికి చేరుకుని ప్రేమజంటను ఆస్పత్రికి తరలించారు. అయితే వారి ఆత్మాహత్యకు ఎందుకు ఒడిగట్టారన్న సమాచారం ఇంకా తెలియరాలేదు.