Kolkata woman doctor death : కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా కస్టడీకి అప్పగించింది. నేటితో సీబీఐ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు నిందితుడిని మరోసారి కోల్‌కతాలోని సిల్దా కోర్టులో హాజరుపర్చారు.
#WATCH | West Bengal: Sanjay Roy, prime accused in the rape and murder of a doctor at the RG Kar College and Hospital brought to Sealdah Court in Kolkata.
His police custody is ending today. https://t.co/XoaWJPyQ2A pic.twitter.com/fAy4K2y82W
— ANI (@ANI) August 23, 2024
దాంతో కోర్టు నిందితుడు సంజయ్ రాయ్‌కి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా ఆగస్టు 8న కోల్‌కతాలోని ఆర్జీ కర్ (RG Kar) ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రెయినీ వైద్యురాలు.. ఆగస్టు 9న తెల్లవారుజామున విశ్రాంతి తీసుకుంటుండగా నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఘటనా ప్రాంతంలో దొరికిన నిందితుడి హెడ్సెట్ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతోపాటు కేంద్ర సర్కారు కూడా ముందుగా ఈ ఘటనపై విచారణ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో నిరసనలు పెల్లుబికాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు అందోళనకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరించారు. దాంతో కేంద్రం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.