Purushaha | టైటిల్‌తోనే అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటున్న సినిమాల్లో ఒకటి పురుష (Purushaha).పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు . సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. దమ్ముంటే నన్ను టచ్ చెయి అంది. ఒక్క రాంగ్ బటన్ నొక్కితే రిజల్ట్ ఇలా ఉంటుందా భయ్యా అంటూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో టచ్ మీ అని రాసి ఉన్న కాస్టూమ్‌లో ఉన్న హీరోయిన్ పంచ్ పవర్‌కు కసిరెడ్డి రాజకుమార్ గాల్లో ఎగరడం చూడొచ్చు.
రీసెంట్గా పాపం అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ పురుష చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తుందోఇ. ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తున్నారు.మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న వస్తోన్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దమ్ముంటే నన్ను టచ్ చెయి అంది ..👊🏽
ఒక్క రాంగ్ బటన్ నొక్కితే రిజల్ట్ ఇలా ఉంటుందా భయ్యా 😉 – @Actor_Rajkumar9#Vishika ‘s Kickass Poster from #Purushaha@kalyanb949 @urvaishukrish@VeeruVulavala #SatishMutyala@urvaishukrish @MeSapthagiri @vennelakishore@vtvganeshoff #PammiSai… pic.twitter.com/ycSWTGQUL5
— Gautam Yarramsetty (@mrgyvcofficial) January 4, 2026