రామన్నపేట, జనవరి 05 : రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సిరిపురం -పెద్ద కాపర్తి రోడ్డు ధర్మారెడ్డి పల్లి కాల్వ పై కల్వర్టు నిర్మాణ పనులు ఇరువైపులా రోడ్డుకు ఒక మీటర్ లోతులో సింగిల్ ట్రాక్ కల్వర్టు నిర్మించడంపై రైతులు ఆందోళన చేపట్టి కల్వర్టు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మీటర్ లోతు సింగిల్ ట్రాక్ కల్వర్టు రోడ్డుకు క్రాస్ గా నిర్మించడంతో లోడ్ ట్రాక్టర్లు, ఆటోలు, వాహనాలు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదన్నారు. వర్షాకాలం వస్తే అటు నుండి, ఇటు నుండి నీరు కల్వర్టుపై చేరి రాకపోకలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ లేకుండా రోడ్డుకు క్రాస్ గా సింగిల్ కల్వర్టు నిర్మించారని ఆరోపించారు. కాంట్రాక్టర్, వారికి సంబంధించిన వ్యక్తులు నిర్లక్ష్యంగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని దుయ్యబట్టారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు పరిశీలించి డబుల్ లైన్ కల్వర్టును మీటర్ ఎత్తులో నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. నిర్మాణ పనులు చేపట్టే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ అఖిలపక్ష నాయకులు, ఉప సర్పంచ్ మూడుదుడ్లే అనూష రమేశ్, బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు ముత్తయ్య, ఏళ్ల సంజీవరెడ్డి, బల్గూరి అంజయ్య, గుంటోజు కృష్ణమాచారి, ఏలే వెంకట నరసయ్య, కట్ట శేఖర్ రెడ్డి, రమేశ్, నర్ర నర్సిరెడ్డి, ఎల్ల మల్లారెడ్డి, గజం సత్యనారాయణ, మోటే మల్లేశం, అప్పం వెంకటేశం, దూలం రవి, శ్రీనివాస్, పబ్బు మల్లయ్య, కట్ట లక్ష్మారెడ్డి, కూనూరు వెంకటేశం పాల్గొన్నారు.