Mosaic Defence : ‘ఆపరేషన్ టైగర్స్ రోర్’ పేరుతో రెండు వారాలుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ సైనిక దాడులకు పాల్పడుతున్నాయి. నాయకత్వ మార్పు తెస్తామంటూ.. క్షిపణులు, డ్రోన్ దాడులతో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంతమొందించాయి. అయినా సరే ఇరాన్ సైన్యం తలొగ్గలేదు. అగ్రరాజ్యం, ఇజ్రాయేల్ సంయుక్త దాడులకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో దీటుగా బదులిస్తోంది ఇరాన్. పటిష్టమైన యుద్ధ సన్నద్ధతకు తోడు కంటికి కనిపించని.. తేలికగా లొంగిపోని ‘మొజాయిక్ డిఫెన్స్'(Mosaic Defence) అనే రక్షణ కోట వ్యూహాత్మక అడుగులు అమెరికాను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ దళానికి ఆద్యుడు మొహమ్మద్ అలీ జఫారీ (Mohammad Ali Zafari).
వెనుజువెలా తరహాలో ఒక్కరోజులోనే ఇరాన్లో నాయకత్వ మార్పు తీసుకురావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికా, ఇజ్రాయేల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, సైనిక అధికారులు, అణు ఇంధన శాస్త్రవేత్తలు.. నేలకొరిగినా ఇరాన్‌లోని రెండు వారాలైనా ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూనే ఉంది.

కేంద్రీకృతంగా కాకుండా పలు అంచెలుగా విభజితమై.. శత్రు సేనల్ని కంగుతినిపించే సామర్ధ్యం కలిగిన మొజాయిక్ డిఫెన్స్ తమ స్టయిల్ దాడులతో అమెరికాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీ తమ దేశ రక్షణ వ్యూహాన్ని తూర్పు, పడమరన అమెరికా సైన్యాన్ని ఓడించదగిన రెండు దశాబ్దాల అధ్యయనంగా అభివర్ణించారు.
మొజాయిక్ డిఫెన్స్ విషయానికొస్తే.. దివంతగత మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ ఈ వ్యవస్థకు ఆద్యుడు. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)లో ఇంటెలిజెన్స్ యూనిట్లో చేరిన జఫారీ.. 2007 – 2019 మధ్య కాలంలో కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలందించారు. ఇస్లామిక్ రివల్యూషన్ అనంతరం కుర్దిస్థాన్ రాష్ట్రం కేంద్రంగా ఆయన ఇరాన్ సైనిక వ్యూహాన్ని సిద్ధం చేశారు.
Who is Mohammad Ali Jafari? The former IRGC chief designed Iran’s Mosaic Defence Doctrine to survive leadership strikes and prolonged wars. #allindiastory #Iran #IRGC #Geopolitics #Defensehttps://t.co/UAhRiKrgvc pic.twitter.com/sFoOfyJryd
— All India Story (@allindiastory) March 13, 2026
సుప్రీం లీడర్లను కోల్పోయినా యుద్ధం కొనసాగే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని భావించారు ఫారీ. ఇరాన్ – ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న ఆయన.. 2005లో ఐఆర్జీసీ వ్యూహాత్మక అధ్యయనం విభాగానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తన అధికారాన్ని ఉపయోగించిన ఆయన.. మొజాయిక్ డిఫెన్స్‌కు రూపమిచ్చారు.
ఇరాన్ – ఇరాక్ యుద్ధం, ఇరాక్‌ను అమెరికా ఆక్రమించిన తీరును సునిశితంగా గమనించి.. ఏకకేంద్ర వ్యవస్థ కాకుండా శాఖలుగా విభజితమై ఒకే లక్ష్యంతో పనిచేసే వ్యవస్థగా మొజాయిక్ డిఫెన్స్‌ను తీర్చిదిద్దారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలో భాగం అయినప్పటికీ స్వతంత్రంగా పని చేస్తుంది. ఒక్కరి ఆదేశాలతో.. ఒకే వ్యవస్థలా కాకుండా గొలుసుకట్టు సంస్థలా మొజాయిక్ డిఫెన్స్ పనిచేస్తుంది. అంటే.. ప్రధాన నాయకుడు మరణించినా.. ప్రత్యర్ధికి లొంగిపోకుండా యుద్ధం కొనసాగించడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఒక వ్యవస్థను నాశనం చేసినంత మాత్రాన శత్రువుకు దాసోహం కావొద్దని ఉద్దేశంతోనే ఈ వ్యవస్థకు జఫారీ ప్రాణం పోశారు.
ఐఆర్జీసీ, ది బసిజ్, సైనిక దళాలు, క్షిపణి దళాలు, నౌకా దళం.. స్థానికంగా పనిచేసే కమాండ్ వ్యవస్థలు మొజాయిక్ డిఫెన్స్‌లో అంతర్భాగం. శత్రువు దాడిలో ఒక దళం దెబ్బతిన్నా.. మిగతావి స్వతంత్రంగా దాడులను కొనసాగిస్తాయి. ఐఆర్జీసీ అనేది 31 ప్రొవిన్షియల్ కమాండ్స్‌గా విభజితమై ఉంటుంది. ప్రతి ప్రొవిన్స్ ఒక సిద్ధ సైనిక శక్తిలాంటిది. అంటే.. సొంతంగా యుధాలు.. ఇంటెలిజెన్స్, కమాండ్ సిస్టమ్ ఉంటాయి. ప్రధాన సైనిక దళాల నుంచి ఆదేశాలు రాని పరిస్థితుల్లో ఇవి వేటికవే స్వేచ్ఛగా రంగంలోకి దిగుతాయి.