Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ 24 గేట్లు ఎత్తి 2.99 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.
సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలివస్తున్నారు. ఇవాళం ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సమయానికి పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలోని వైరా జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది. వైరా జలాశయం 20 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటడంతో అలుగు పొంగి పొర్లుతోంది. స్థానికులు వైరా జలాశయం వద్దకు చేరుకుని, ప్రాజెక్టును వీక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Khammam | మున్నేరుకు భారీగా వరద.. 16 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Sriram Sagar | శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. 9 గేట్లు ఎత్తివేత
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్