Sriram Sagar | నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు వరద పోటెత్తింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 45,510 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 8,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 3,667 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 11,396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలుగా ఉంది.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 12,633 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 19,740 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 28.885 టీఎంసీలుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు