KTR | హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ స్థానం పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. మీరు సాధించిన విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర్కొంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
డియర్ రేవంత్ రెడ్డి గారు అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని, ఊహించలేని అత్యల్ప ర్యాంక్‌కు చేర్చిన మిమ్మల్ని అభినందిస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ ఎద్దెవా చేశారు. సాధించిన ఈ అద్భుత విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదన్నారు. ఈ స్థానానికి రావడానికి స్వచ్ఛ్ బయో, వాల్స్ కర్ర లాంటి ఆవిష్కరణలు చాలా అవసరమని పేర్కొన్నారు. తదుపరి దావోస్ సమ్మిట్‌లో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి రేవంత్ రెడ్డి వివరించాలన్నారు. కేవలం 9 నెలల్లోనే ఇంత సాధించిన మీరు రానున్న నాలుగేండ్లలో సాధించే వాటికి సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందన్న భయం కలుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరో సారి అభినందనలు అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను ముగించారు.
Dear Revanth Reddy garu!
I am at loss of words to describe this stupendous ‘achievement’ of yours!
Firstly! Let me have the honor of congratulating you for this unthinkable feat of catapulting a state that was top rated in Ease Of Doing Business to the lowest ranking… https://t.co/TDCa4rHWPf
— KTR (@KTRBRS) September 7, 2024
ఇవి కూడా చదవండి..
TG Rains | రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మున్నేరుకు పోటెత్తిన వరద
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు