TG Rains | హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్లీ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సాగునీటి జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలకు అధికారులను మంత్రులు ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.25 సెం.మీ., ఖమ్మం జిల్లా తల్లాడలో 12.15 సెం.మీ., భద్రాద్రి జిల్లా మద్దుకూరులో 9.23 సెం.మీ., ఖమ్మం జిల్లా మంచుకొండలో 9 సెం.మీ., రఘునాథపాలెంలో 8.9 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా గార్లలో 8.1 సెం.మీ., భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ., వికారాబాద్ జిల్లా ధవలాపూర్‌లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. 12.8 అడుగుల వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 16 అడుగులకు చేరగానే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో మున్నేరు వరద పోటెత్తింది. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Horoscope | 08-09-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు
US Open 2024 | చరిత్రకు ఒక్క అడుగే.. ఒత్తిడి లేదంటున్న అమెరికా టీనేజర్