US Open 2024 : అమెరికా టీనేజర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) యూఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. 21 ఏండ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న టేలర్ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో ఉన్నాడు. ఆదివారం జరుగబోయే ఫైనల్లో అతడు ఇటలీ స్టార్ జన్నిక్ సిన్నర్(Jannik Sinner)తో తలపడనున్నాడు.
ఒకవేళ టైటిల్ పోరులో గనుక టేలర్ విజయం సాధిస్తే చరిత్రలో నిలిచిపోతాడు. ఆండీ రాడిక్(Andy Roddick) తర్వాత గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ గెలుపొందిన రెండో అమెరికన్‌గా టేలర్ రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు. దాంతో, అతడిపై భారీ అంచనాలతో పాటు ఒత్తిడి కూడా ఉంది. అయితే.. టేలర్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతానని అంటున్నాడు.
One Final match. pic.twitter.com/lRYl4E1LlB
— US Open Tennis (@usopen) September 7, 2024
‘సిన్నర్‌తో ఆడడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. నిజంగా చెప్పాలంటే.. ఈరోజు కంటే ఫైనల్లో ఎక్కువ ఒత్తిడితో ఆడుతానని మాత్రం అనుకోవడం లేదు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కంటే ఎందుకో నాకైతే ఈరోజే చాలా ఒత్తిడిగా అనిపించింది. నేను రేపు అత్యుత్తమ ఆటతో టైటిల్ గెలుపొందుతాననే నమ్మకం నాకుంది. ఒకవేళ నేను నా స్థాయికి తగ్గట్టు ఆడితే.. టైటిల్ విజయానికి అదొక్కటి సరిపోతుందని అనుకుంటున్నా’ అని సెమీ ఫైనల్ విజయం అనంతరం టేలర్ అన్నాడు.
Taylor Fritz outlasted Frances Tiafoe in this epic 4th set rally.
He won 9 of the next 11 games. pic.twitter.com/qyvJWjtsuI
— US Open Tennis (@usopen) September 7, 2024
ఆద్యంతం ఉత్కంఠ రేపిన సెమీస్‌లో అమెరికాకే చేందిన ఫ్రాన్సెస్ తైఫోపై 4-6, 7-5, 4-6, 6-4, 6-1తో జయభేరి మోగించాడు. మరోవైపు టాప్ సీడ్ సిన్నర్ మాత్రం అలవోకగా ఫైనల్ చేరాడు. డ్రాపర్ను చిత్తుగా ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ఇటలీ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. దాంతో.. టేలర్, సిన్నర్లలో ఎవరు యూఎస్ ఓపెన్ గెలుపొందినా పురుషుల సింగిల్స్‌లో కొత్త యోధుడు పుట్టినట్టే.