Hokato Hotozhe : ఉగ్రవాదుల ఏరివేతలో పాదం కోల్పోయిన వీర సైనికుడు హొకతో హొటోజే సెమా(Hokato Hotozhe Sema) పారాలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించాడు. షాట్‌పుట్(Shotput) పురుషుల ఎఫ్57 విభాగంలో హెకతో పతకంతో మెరిశాడు. విశ్వ క్రీడల్లో పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన హెకతోపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫిహు రియో(Neiphiu Rio) అతడికి భారీ నగదు బహుమతి ప్రకటించారు.
తమ రాష్ట్ర ఖ్యాతిని పెంచిన హోకతోకు రూ.1.5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ‘పారాలింపిక్స్ షాట్‌పుట్ పోటీల్లో హొకతో హొటోజె సెమా కాంస్యం సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అతడు భారతదేశం గర్వపడేలా చేశాడు. నాగాలాండ్‌కు పేరు తెచ్చాడు. మా రాష్ట్రానికి విశ్వ క్రీడల్లో ఇది తొలి పతకం.
We’re proud & joyous for Mr. Hokato Hotozhe Sema on winning Bronze🥉at the #ParalympicsGames in Shot Put event. He’s made India proud & Nagaland shine. Being the 1st Olympic Medalist from Nagaland, I’m happy to announce that the Nagaland Govt will extend a cash reward of ₹1.5Cr
— Neiphiu Rio (@Neiphiu_Rio) September 7, 2024
అందుకని మా స్టేట్ తరఫున హొకతోకు రూ.1.5 లక్షల నగదు బహుమతి ఇస్తాన్నామని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని నీఫియు రియో తెలిపారు. శనివారం జరిగిన షాట్‌పుట్ పోటీల్లో హొకతో కాంస్యంతో మెరిశాడు. దాంతో, భారత్ ఖాతాలో 27వ పతకం చేరింది. పారాలింపిక్స్ పోటీలకు సెప్టెంబర్ 8, ఆదివారం ఆఖరి రోజు.