Sachin Tendulkar | భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చంధోక్ (Saaniya Chandhok)తో అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే అర్జున్-సానియా వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్. పలు మీడియా నివేదికల ప్రకారం.. మార్చి 3, 4, 5 తేదీల్లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కొద్దిమంది క్రికెటర్ల సమక్షంలో జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
టెండూల్కర్ కుటుంబానికి కాబోయే కోడలు సానియాది వ్యాపార నేపథ్యమున్న కుటుంబం. తను సచిన్ తనయ సారాకు మంచి స్నేహితురాలు కూడా. 2020లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యేయేషన్ పూర్తి చేసిన సానియా సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. జంతు ప్రేమికురాలైన తను ముంబైలోనే మిస్టర్ పాస్ పెట్ స్పా, స్టోర్ పేరుతో ఒక బొటిక్ తెరిచింది. సారా ద్వారా అర్జున్‌కు పరిచయం అయిన సనా అతడిపై మనసు పారేసుకుంది. ఈ పేస్ గన్ సైతం ఆమెను ఇష్టపడ్డాడు.
Also Read..
Jacob Bethell: జాకబ్ బేతల్ 142 నాటౌట్.. ఆస్ట్రేలియాపై స్వల్ప ఆధిక్యం
T20 World Cup: వేదిక మార్పుపై బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
అమన్ 200.. అజేయ డబుల్ సెంచరీతో విజృంభణ