సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బేతల్(Jacob Bethell) సెంచరీ చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బేతల్ 142 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 8 వికెట్ల నష్టానికి 302 రన్స్ చేసింది. దీంతో ఆ జట్టుకు 119 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే చివరి రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లండ్‌కు ఓటమి అనివార్యంగా తోస్తున్నది.
జాకబత్ బేతల్ వయసు 22 ఏళ్లు. అతనికి ఇది ఆరో టెస్టు. వన్‌డౌన్‌లో క్రీజ్‌కు వచ్చిన బేతల్.. తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. బేతల్ మాత్రం తన పోరాట స్పూర్తిని ప్రదర్శించాడు. 232 బంతుల్లో అతను 15 ఫోర్లు కొట్టాడు. ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఒకవేళ బేతల్ భారీ ఇన్నింగ్స్ ఆడకుంటే ఇప్పటికే మ్యాచ్ పూర్తి అయ్యేది. గజ్జల్లో నొప్పి కారణంగా బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేశాడు. కానీ కేవలం ఒక్క పరుగుకే అతను ఔటయ్యాడు. అంతకముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యధికంగా 138 రన్స్ చేసి నిష్క్రమించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 183 పరుగుల ఆధిక్యం లభించింది. బెన్ డకెట్‌తో కలిసి 81, హ్యారీ బ్రూక్‌తో కలిసి 134 రన్స్ జోడించాడు బేతల్.
SMASHED TO THE FENCE! 🤩
A FIRST TEST CENTURY FOR JACOB BETHELL!! 💯 pic.twitter.com/dh2cYYkvxE
— England Cricket (@englandcricket) January 7, 2026