Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
ప్రమాదస్థలికి చేరుకున్న 4 అగ్నిమాపక వాహనాలు.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సెలవు దినం కావడంతో ఆ పరిశ్రమలో ఇవాళ కార్మికులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక కాలనీ వాసులు తమ ఇండ్లను వదిలి బయటకు వస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత.. మూసీకి పోటెత్తిన నీటి ప్రవాహం
CV Anand | హైదరాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామకం
Kaloji Award | నలిమెల భాస్కర్‌కు ప్రజాకవి కాళోజీ పురస్కారం..