Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుండడంతో, పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఈ క్రమంలో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు జలమండలి అధికారులు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఉస్మాన్ సాగర్ 2 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఒక గేటు అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ జలాశయం ఇన్ఫ్లో 1400 క్యూసెక్కులుగా ఉంది. మూసీలోకి 340 క్యూసెక్కులను విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 2.45 టీఎంసీలు.
ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1800 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు 226 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.95 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 3.90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 3.43 టీఎంసీలు.
ఇవి కూడా చదవండి..
CV Anand | హైదరాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామకం
Jagga Reddy | ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి.. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు