Jagga Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కులాలతో రాజకీయం నడుస్తలేదు.. పైసలతోనే రాజకీయం నడుస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కులం, మతం తర్వాత.. ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే పైసలు పెట్టాల్సిందే అని జగ్గారెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంపీకి కూడా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఏ కులమో, ఏ మతమో తర్వాతనే.. ముందు పైసలతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవిని ఏఐసీసీ ఇచ్చింది. మహేశ్ గౌడ్ అందరినీ కలుపుకుని పోతారని భావిస్తున్నాను. నేను కూడా పీసీసీ కావాలనుకున్నా.. ఎప్పటికైనా అవుతాను. కాంగ్రెస్ పెద్ద పార్టీ.. ఎవరైనా పీసీసీ కావొచ్చు. బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మహేశ్ గౌడ్‌కు పీసీసీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి
సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి 100కోట్లు ఖర్చు పెట్టాలి
కులాలతో రాజకీయం నడుస్తలేదు పైసలతో నడుస్తుంది – కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి pic.twitter.com/fFCfevy8UR
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2024
ఇవి కూడా చదవండి..
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Manipur | మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఆరుగురు మృతి
CV Anand | హైదరాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామకం