Manipur | మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఆరుగురు మృతి
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Manipur | ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు సాయుధులు ప్రాణాలు కోల్పోయినట్లు మణిపూర్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.
రాకెట్ దాడుల్లో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తొలి రాకెట్ దాడి తెల్లవారుజామున 4.30 గంటలకు ట్రోంగ్లావ్‌బిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రెండో దాడి మ. 3 గంటలకు మొయిరంగ్‌లోని మాజీ సీఎం మైరెంబమ్ కొయిరెంగ్ నివాస ఆవరణలో జరిగింది. రాకెట్‌కు అమర్చిన బాంబులు పేలడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నేపథ్యంలో చూరాచాంద్‌పుర్‌లోని మువాల్‌సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మూడు బంకర్లను కూల్చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి..
Road Accident | ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
Ollie Pope | టెస్టుల్లో పోప్ సంచలనం.. 147 ఏండ్ల చరిత్రలో ఒకేఒక్కడు
Srisailam Reservoir | శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

