Ollie Pope : టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్(Joe Root) రికార్డు సెంచరీలో దూసుకెళ్తుంటే.. నేనీమీ తక్కువ కాదంటూ కెప్టెన్ ఓలీ పోప్(Ollie Pope) సంచలనం సృష్టించాడు. 147 ఏండ్ల సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో దిగ్గజాలకు సైతం సాధ్యంకాని రికార్డును పోప్ సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval) స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో పోప్ శతకంతో గర్జించాడు. దాంతో, ఏడు దేశాలపై టెస్టుల్లో వంద కొట్టిన తొలి ఆటగాడిగా పోప్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు.
గాయపడిన బెన్ స్టోక్స్ స్థానంలో పగ్గాలు అందుకున్న పోప్ తొలి రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. పిరికి కెప్టెన్ అంటూ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అతడు మూడో టెస్టులో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 101 బంతుల్లోనే వంద కొట్టి ఔరా అనిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికి ఇది ఏడో సెంచరీ. విశేషం ఏంటంటే.. ఈ ఏడు శతకాలను పోప్ ఏడు దేశాలపై.. ఏడు వేర్వేరు మైదానాల్లో సాధించాడు.
Ollie Pope – The first batter in history to score his first seven Test hundreds against different opposition.
Take a bow, Ollie 🤝 pic.twitter.com/37hYVSfiN2
— England Cricket (@englandcricket) September 6, 2024
పోప్ 2020లో దక్షిణాఫ్రికాపై తన తొలి సెంచరీ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై నాటింగ్హమ్లో, పాకిస్థాన్‌పై రావల్పిండి స్టేడియంలో పోప్ శతకంతో చెలరేగాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌పై ఉప్పల్ స్టేడియంలో పోప్ సూపర్ సెంచరీ(194) సాధించాడు. అనంతరం వెస్టిండీస్‌పై ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఈ సొగసరి బ్యాటర్ నూరు కొట్టేశాడు. అయితే.. పోప్ ఇప్పటివరకూ ఆస్ట్రేలియా, జింబాబ్వే, అఫ్గనిస్థాన్లపై మాత్రమే వంద కొట్టలేదు.
🇿🇦 135* vs South Africa
🇳🇿 145 vs New Zealand
🇵🇰 108 vs Pakistan
☘️ 205 vs Ireland
🇮🇳 196 vs India
🏝️ 121 vs West Indies
🇱🇰 103* vs Sri LankaOllie Pope is the first player in Test history to score his first seven hundreds against seven different teams 😲 pic.twitter.com/jXZl4xSoFG
— ESPNcricinfo (@ESPNcricinfo) September 6, 2024