అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని (Chandrababu ) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) శనివారం విజయవాడ కలెక్టరేట్లో కలిశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains), బుడమేరు(Budameru) గండ్ల వల్ల నష్టపోయిన బాధితుల కోసం సీఎం సహాయనిధి కింద కోటి రూపాయలను(One Crore) ప్రకటించారు.
ఇందులో భాగంగా శనివారం రూ. కోటి చెక్కును చంద్రబాబుకు అందజేశారు. వరద ప్రభావంతో ఏపీలో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ. లక్షను పవన్‌కల్యాణ్ సొంత నిధులను విరాళంగా ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. తెలంగాణకు కూడా డిప్యూటీ సీఎం రూ. కోటిని ప్రకటించిన విషయం తెలిసిందే .