హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, వ్యవస్థాపకుడు వేణుగోపాలస్వామి, జాక్టో మాజీ అధ్యక్షుడు జీ భుజంగరావు, జీ మాధవరెడ్డి, సోమ్లానాయక్, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.
భీమాశంకర్ మృతికి కేటీఆర్ సంతాపం
వేములవాడ టౌన్, జనవరి 6 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విశ్రాంత స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. మంగళవారం ఉదయం భీమాశంకర్ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.