Mathu Vadalara 2 | ‘యమదొంగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు స్వర మాంత్రికుడు ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు అవుదామని ఉద్ధేశంతో సుకుమార్ దగ్గర ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అయితే అనూహ్యంగా హీరో అవతారమెత్తి ‘మత్తు వదలరా’ చిత్రాన్ని చేశాడు. మొదటి సినిమాతోనే నటుడుగా గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండగా.. శ్రీసింహా (Sri Simha), సత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది.
#MathuVadalara2 is Certified U/A
All set for a grand release on September 13th. 6 DAYS TO GO
Listen to #DramaNakkoMama promotional song now!
Written, sung and choreographed by @fariaabdullah2
A @kaalabhairava7 musicalA @RiteshRana sequel… pic.twitter.com/sFLSSCQfuJ
— Vamsi Kaka (@vamsikaka) September 7, 2024