The Academy | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ అంతర్జాతీయ వేదికపై మరో ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ (The Academy) మ్యూజియంలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న “వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ” (Where the Forest Meets the Sea) అనే ప్రత్యేక వేడుకలో ఈ సినిమా ప్రదర్శన కాబోతుండగా.. ఈ వేడుకకు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ‘భ్రమయుగం’ రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో అద్భుతమైన విజువల్స్ మరియు సౌండ్ డిజైనింగ్‌తో తెరకెక్కించారు. ఇక మమ్ముట్టి తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచిన చిత్రాల్లో ఇది ఒకటి. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. 1850 కాలం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కథ అధికారం, అత్యాశ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులను భయపెడుతూనే ఆలోచింపజేస్తుంది.
#Bramayugam finds its place at the Oscar Academy.
The film is the only Indian entry to be screened on February 12 at the Academy Museum’s “Where the Forest Meets the Sea” series in Los Angeles. #Bramayugam @mammukka #RahulSadasivan #ArjunAshokan #SidharthBharathan pic.twitter.com/uzAUmH3n0S— Sony LIV (@SonyLIV) January 8, 2026