ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆ ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, రాజ్‌పుర ఎమ్మెల్యే బాలా బచ్చన్ కుమార్తె మరణించింది. ప్రాణాలు కోల్పోయినవారిలో మరో ఇద్దరు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇండోర్ సమీపంలో ప్రమాదం జరిగింది. తేజాజి నగర్ బైసాస్ సమీపంలో ఉన్న రాలామండల్ ఏరియాలో ట్రక్కును కారు ఢీకొన్నట్లు తేజాజి నగర్ పోలీసు స్టేషన్ ఇంఛార్జీ దేవేంద్ర మారకం తెలిపారు. మాజీ మంత్రి కుమార్తె ప్రేరణ బచ్చన్‌తో పాటు ఇద్దరు యువతులు మన్ సంధు, ప్రకార్ ప్రమాదంలో మరణించారు.
కారులో ప్రయాణిస్తున్న మరో యువతి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆమెను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే దేని వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. సీనియర్ జిల్లా యంత్రాంగం, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ప్రమాదానికి మరింత సమాచారం రావాల్సి ఉన్నది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ మృతి పట్ల నివాళి అర్పించారు.