US Open 2024 : ఇటలీ సంచలనం జన్నిక్ సిన్నర్(Jannik Sinner) చరిత్ర సృష్టించాడు. తొలిసారి యూఎస్ ఓపెన్(US Open 2024) ఫైనల్లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ దేశస్థుడిగా సిన్నర్ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో జాక్ డ్రాపర్ (Jack Draper)పై సిన్నర్ విజయం సాధించాడు.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 7-5, 7-6, 6-2తో సిన్నర్ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. సెప్టెంబర్ 8, ఆదివారం జరుగబోయే టైటిల్ పోరులో అతడు టేలర్ ఫ్రిట్జ్ (Taylor Fritz)తో తలపడనున్నాడు. మరోవైపు అమెరికా సంచలనం టేలర్‌కు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. దాంతో, ఈసారి కొత్త చాంపియన్‌ను చూడడం ఖాయం.
Take it in, Taylor! pic.twitter.com/AqQjISQAK7
— US Open Tennis (@usopen) September 7, 2024
టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సిన్నర్ సెమీస్‌లోనూ పంజా విసిరాడు. జాక్ డ్రాపర్ ఎత్తులను చిత్తు చేస్తూ తొలి ట్రై బ్రేక్ సాధించాడు. అదే ఊపులో ఈ టాప్ సీడ్ ఆటగాడు రెండు సెట్లు అలవోకగా గెలుపొందాడు. ఇక మూడో సెట్లోనూ జాక్ పెద్దగా ప్రతిఘటించలేకపోయాడు. దాంతో, సిన్నర్ విజయం నల్లేరు మీద నడకే అయిందనుకో.
The list of Italian men to reach the US Open final:
-Jannik Sinner 🇮🇹
That’s it. That’s the list #USOpen pic.twitter.com/hSt0IDS89c
— Roland-Garros (@rolandgarros) September 6, 2024
గత సీజన్ నుంచి అత్యుత్తమ ఆటతో చెలరేగుతున్న సిన్నర్ యూఎస్ ఓపెన్ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచాడు. ఫైనల్లో అతడు గెలిస్తే.. ఈ గ్రాండ్‌స్లామ్ గెలుపొందిన తొలి ఇటలీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ‘జాక్, నేను ఒకరికొకరం బాగా తెలుసు. కోర్టు బయట మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. ఇది నిజంగా చాలా కష్టమైన మ్యాచ్. జాక్ ఓడించడం అంత సులువు కాదు. అతడిని చిత్తు చేసి ఫైనల్ చేరినందకు చాలా సంతోషంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం సిన్నర్ తెలిపాడు.