అమరావతి : విజయవాడను ముంచెత్తిన బుడమేరు(Budameru ) వాగు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గత ఐదురోజులుగా నిరంతర పనులు చేపట్టిన అధికారులు, ఆర్మీ సిబ్బంది శనివారం మధ్యాహ్నం మూడో గండి (Third tank) పూడ్చివేతను విజయవంతంగా పూర్తి చేశారు.
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Ramanaidu) గండ్ల వద్దే ఉండి అనుక్షణం పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులను, సిబ్బందిని ఎప్పటికప్పుడూ పురిగొల్పుతూ పనుల పూర్తిలో ప్రధాన పాత్ర పోషించారు. గండ్ల పనుల పూర్తి పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామని పేర్కొన్నారు. కట్ట ఎత్తు పెంచే పనులు కూడా వెంటనే చేపడుతామని , రేగడిమట్టిని నింపి సీపేజీని కూడా పూర్తిగా అరికడతామని ప్రకటించారు. విజయవాడలో ఉన్న నీరుకూడా క్రమంగా తగ్గుతుందన్నారు. అవసరమైతే మోటార్లు పెట్టి విజయవాడలో నీటిని తోడేస్తామని వివరించారు.
బుడమేరు వాగుకు పడ్డ మూడు గండ్ల వళ్ల విజవాడలో 32 కాలనీలు వరదతో మునిగిపోయాయి. సుమారు లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. రోజురోజుకు నీటిప్రవాహం ఎక్కువ కావడంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో బాధితులను ఇతర చోటుకు తరలించారు. వర్షాలు, వరదల వల్ల 29 మంది చనిపోయారు. ఎట్టకేలాగు బుడమేరు గండ్లను పూడ్చి వేయడం వల్ల క్రమంగా నీటి ప్రవాహం తగ్గుతుందడంతో విజయవాడ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.