Road Accident | ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న వ్యానును.. ఆగ్రా- అలీగఢ్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న వ్యానును.. ఆగ్రా- అలీగఢ్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 15 మంది మరణించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరింది. మరో 16 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. వారిలో 11 మందిని హాథ్రస్ హాస్పిటల్కు, ఐదుగురిని అలీగఢ్ దవాఖానకు తరలించామన్నారు.
మృతులను ఇర్షాద్ (25), మున్నె ఖాన్ (55), ముస్కాన్ (16), తల్లి (28), తబస్సుమ్ (28), నజ్మా (25), భోలా (25), ఖుష్బు (25), జమీల్ (50), చోటే (25), అయాన్ (2), సుఫియాన్ (1), అల్ఫాజ్ (6), షోయబ్ (5), ఇష్రత్ (50), అప్పి (2), గుల్షన్గా గుర్తించారు.
కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

