Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు.
Khairatabad Ganesh | హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు దానం నాగేందర్ శ్రీరాముడి విగ్రహాన్ని అందజేశారు.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి వారికి రెండు వైపుల అయోధ్య శ్రీబలరాముడు, రాహు, కేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను భక్తులకు కనువిందు చేస్తున్నారు. నవరాత్రోత్సవాలకు ఉత్సవ కమిటీతో పాటు పోలీసు శాఖ, జీహెచ్ఎంసీ సకల ఏర్పాట్లు కల్పించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
CV Anand | హైదరాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామకం
Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

