Osman Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఈ రెండు జలాశయాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
సాయంత్రం 5 గటలకు ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ ఒక గేటు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులు. ఈ రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తనున్న క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెగిపడిన గజ మాల
Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Srisailam Reservoir | శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీటి విడుదల