CM Revanth Reddy | ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెగిపడిన గజ మాల
ఖైరతాబాద్ బడా గణేషుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. స్వామివారి స్వామివారి తొలిపూజలో పాల్గొన్నారు. అంనంతరం మాట్లాడుతూ.. 70 ఏండ్ల నుంచి దేశం దృష్టినంతా ఆకర్షించేలా వినాయకుడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి వారికి రెండు వైపుల అయోధ్య శ్రీబలరాముడు, రాహు, కేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను భక్తులకు కనువిందు చేస్తున్నారు.
ఖైరతాబాద్ బడా గణేషుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. స్వామివారి స్వామివారి తొలిపూజలో పాల్గొన్నారు. అంనంతరం మాట్లాడుతూ.. 70 ఏండ్ల నుంచి దేశం దృష్టినంతా ఆకర్షించేలా వినాయకుడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు తెలంగాణకే గర్వకారణమని చెప్పారు. నిష్టతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శాంతి, మతసామరస్యం, పాడిపంటలతో రాష్ట్రం వర్ధిల్లుతుందని తెలిపారు.
ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో 1.40 లక్షల గణేషుడి విగ్రహాలను నెలకొల్పారని, మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భారీ వరదలు వచ్చినప్పటికీ తక్కువ నష్టంతో బయటపడ్డామని వెల్లడించారు. కాగా, సీఎం రేవంత్ వేదికపై ఉన్నప్పుడే వినాయకుడికి ఉన్న గజమాల ఒక్కసారిగా తెగిపడింది.

అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ దంపతులు కూడా పాల్గొన్నారు. కాగా, ఖైరతాబాద్ మహాగణపతికి ప్రతి ఏడాది గవర్నర్ తొలిపూజ నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి సారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిపూజకు హాజరుకానున్నారు. సాయంత్రం 3గంటల ప్రాంతంలో తెలంగాణ గవర్నర్ హాజరవుతారని ఉత్సవ కమిటీ తెలిపింది.
మొన్న గుమ్మడి కాయ.. నేడు గజ మాల
ఖైరతాబాద్ గణేష్ వద్ద తెగిన గజ మాల..
రేవంత్ రెడ్డి ఉండగానే పడిన గజ మాల https://t.co/xg2Bnork3X pic.twitter.com/M38f7tEh4b
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

