TG Rains | హైదరాబాద్ : గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నెల 8వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Kaloji Award | నలిమెల భాస్కర్‌కు ప్రజాకవి కాళోజీ పురస్కారం..
Jagga Reddy | ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి.. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Nagarjunasagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల