Danish Kaneria : సుదీర్ఘ ఫార్మాట్లో పాకిస్థాన్ జట్టు ఆట రోజురోజుకు మరింత దిగజారుతోంది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో 2-0తో టెస్టు సిరీస్ ఓడిన పాక్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయింది. దాంతో, షాన్ మసూద్(Shan Masood) బృందంపై మాజీలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు గౌతం గంభీర్ (Gautam Gambhir) లాంటి హెడ్‌కోచ్ అవసరం ఉందని కనేరియా అన్నాడు.
అంతేకాదు పలువురు పాక్ మాజీలు సైతం గంభీర్ తరహా కోచ్ తమకు కావాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ‘గంభీర్ ఒక అద్భుతమైన క్రికెటర్. అంతేకాదు మంచి మనిషి కూడా. ఏ విషయమైనా సరే అతడు ముక్కుసూటిగా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి వెన్నుపోటు పొడవడం తెలియదు. ఎవరైనా సరే అలానే ఉండాలి’ అని కనేరియా మాట్లాడాడు. అంతేకాదు ‘పాకిస్థాన్ క్రికెటర్లలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఉంది.
Former Pakistan spinner Danish Kaneria wants Gautam Gambhir-like head coach for Pakistan amidst cricket fiasco in country.#GautamGambhir | #DanishKaneria pic.twitter.com/1d9VNz0E0T
— OneCricket (@OneCricketApp) September 7, 2024
Gautam gambhir can save their cricket the Pakistani know this.#GambhirSavePak pic.twitter.com/67Uyc5u5ir
— Kedar (@shintre_kedar) September 7, 2024
ఆ వైఖరే పాక్ క్రికెట్ పతనానికి దారి తీస్తోంది. పైగా తరచూ కెప్టెన్లను మార్చడం అనేది పరిపాటి అయింది. అలా చేయడం వల్ల ఏం లాభం ఉండదు. ఇప్పుడు మిగతా జట్లు అన్ని అద్భుతంగా ఆడుతున్నాయి. భారత్‌నే తీసుకోండి.. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఆధ్వర్వంలో ఆ జట్టు గొప్ప విజయాలు సాధించింది. ఇప్పుడు గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చాడు. అతడు చాలా ముక్కుసూటి మనిషి’ అని కనేరియా వెల్లడించాడు.
నిరుడు వన్డే వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ క్రికెట్లో సంక్షోభం మొదలైంది. బాబర్ ఆజాంపై వేటు వేసిన పీసీబీ.. టెస్టులకు షాన్ మసూద్‌ను.. టీ20లకు షాహీన్ ఆఫ్రిదీని కెప్టెన్‌గా చేసింది. అయితే.. ఇద్దరూ జట్టును గెలిపించడంలో విఫమయ్యారు. ఇక టీ20 వరల్డ్ కప్ ముందు మళ్లీ బాబర్‌కు పగ్గాలు అప్పగించిన పీసీబీ.. ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయింది.
కనీసం సొంత గడ్డపై అయినా పాకిస్థాన్ జట్టు గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. పర్యాటక బంగ్లాదేశ్ చేతిలో రెండు టెస్టుల్లోనూ ఓడిన పాకిస్థాన్ డబ్ల్యూటీసీ(World Test Championship) పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దాంతో, ప్రస్తుతం టెస్టు క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం జేసన్ గిలెస్పీపై పాక్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్రోఫీతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల సంబురం