England Cricket : ఇంగ్లండ్ జట్టుకు పెద్ద షాక్. ఈ మధ్యే అత్యంత వేగవంతమైన బంతి విసిరి రికార్డు సృష్టించిన ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) ఏడాదంతా ఆటకు దూరం కానున్నాడు. కుడి మోచేతి(Right Elbow) గాయంతో బాధ పడుతున్న వుడ్ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోనుండడమే అందుకు కారణం. ఈ విషయాన్ని శుక్రవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు వెల్లడించాయి.
‘కుడి చేతి మోచేయికి గాయం కారణంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఈ ఏడాదంతా క్రికెట్‌కు దూరం కానున్నాడు. దాంతో, అతడు పాకిస్థాన్, న్యూజిలాండ్ పర్యటనలకు అందుబాటులో ఉండడు. వచ్చే ఏడాది ఆరంభానికల్లా వుడ్ పూర్తిగా ఫిట్నెస్ సాధించే అవకాశముంది. అప్పడు భారత పర్యటనతో పాటు చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో వుడ్ ఆడతాడని భావిస్తున్నాం అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు’ ఓ ప్రకటనలో తెలిపింది.
We’re backing you all the way, Woody 👊
Looking forward to the return of the rockets in 2025 🚀🚀🚀 pic.twitter.com/cariGlf8bS
— England Cricket (@englandcricket) September 6, 2024
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో బౌలింగ్ చేస్తుండగా వుడ్ ఒక్కసారిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అతడు మైదానంలోకి రాలేదు. స్కానింగ్ పరీక్షలు చేయగా అతడి కుడి మోచేయి దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఆరు నెలలపైనే విశ్రాంతి అవసరమైన వుడ్‌కు సూచించారు. అదే టెస్టులో వుడ్ తొడ కండరాల గాయంతో కూడా బాధ పడ్డాడు. అయితే.. ఆ సమస్య నుంచి అతడు వేగంగా కోలుకుంటున్నాడని ఈసీబీ వెల్లడించింది.
MARK WOOD BOWLED A 156.2KMPH DELIVERY. 🤯pic.twitter.com/I0eQJnvecp
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 19, 2024
ఇంగ్లండ్ పేస్ సంచలనంగా మారిన వుడ్ టెస్టుల్లో చరిత్ర సృష్టించాడు. వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. సొంతగడ్డపై ఫాస్టెస్ట్ ఓవర్‌తో రికార్డులు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో వుడ్ సగటున గంటకు 94.7 మైళ్ల వేగంతో అంటే.. 152.4 కిలోమీటర్ల వేగంతో ఆరు బంతులు వేశాడు. అతడి వేగానికి విండీస్ బ్యాటర్లు మాత్రమే కాదు స్టేడియంలోని అభిమానులంతా ఆవాక్కయ్యారునుకో.