Duleep Trophy 2024 : టీ20 వరల్డ్ కప్ హీరో రిషభ్ పంత్(Rishabh Pant) మరోసారి బ్యాట్ ఝులిపించాడు. దేశవాళీ లీగ్స్‌లో పాపులర్ అయిన దులీప్ ట్రోఫీలో అర్ధ శతకంతో చెలరేగాడు. ‘ఇండియా బీ'(India B) తరఫున తొలి ఇన్నింగ్స్‌లో నిరాపరిచిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయాడు. ‘ఇండియా ఏ’ బౌలర్లను ఉతికేస్తూ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే యాభై కొట్టిన పంత్ ఇండియా బీ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు.
పంత్ విధ్వంసంతో ఇండియా బీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే.. ప్రమాదకరంగా మారిన పంత్(61)ను తనుష్ కొతియాన్ సూపర్ డెలివరీతో వెనక్కి పంపాడు. దాంతో 140 వద్ద ఇండియా బీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం యువ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్(18), వాషింగ్టన్ సుందర్(7)లు విలువైన పరుగులు జోడించే పనిలో ఉన్నారు. ఇప్పటికీ ఇండియా బీ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో ఉంది.
50 for Rishabh Pant! 👌
He brings it up off just 34 balls 🔥#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38DTlt pic.twitter.com/OPSfsvFhqI
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
తొలి ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్(181) సూపర్ సెంచరీ, నవ్‌దీప్ సైనీ(56) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరూ 8వ వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించారు. దాంతో, ఇండియా బీ 321 పరుగులు చేసింది. అనతంరం సైనీ(3/60), ముకేశ్ కుమార్(3/62)ల బుల్లెట్ బంతులకు ఇండియా ఏ ఆటగాళ్లు నిలువలేకపోయారు. దాంతో, ఇండియా ఏ 231 పరుగులకే కుప్పకూలింది.
ముషీర్ ఖాన్(181)