అమరావతి : ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్(Prakasam barrage ) గేట్లను ఢీకొన్ని నాలుగు బోట్లు వైసీపీ నాయకులవేనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పడవల మీద వైసీపీ రంగులే (YCP Colours) ఉన్నాయని విమర్శించారు. బుడమేరు వాగులో వైసీపీ నాయకులు ఇసుక, మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారని ఆరోపించారు. దానివల్లే గండ్లు తెగి విజయవాడ ముంపునకు గురైందని ఆరించారు.
గత సోమవారం రోజున కృష్ణా నది (Krishna River) కి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి నాలుగు ఇనుప బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్ తగలడంతో అవి దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు.