కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను( Sankranti celebrations) నిర్వహించారు. నాటి సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చిన్నారులకు భోగి వేడుక, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.

రకరకాల పిండి వంటల ప్రదర్శన, హరిదాసుల విన్యాసాలు అచ్చమైన తెలంగాణ సాంప్రదాయాలతో చిన్నారులు అలరించారు. సంక్రాంతి సమయంలో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించి సంతోషంగా ఉంటారని అందుకే ఈ పండుగను ప్రతి ఇంటింటా ఘనంగా జరుపుకుంటారని ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం గాలి పటాలను ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.