రామవరం, జనవరి 09 : క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో శుక్రవారం యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సహనశక్తి, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించే మనోభావాన్ని క్రీడలు నేర్పుతాయన్నారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్ కావునా ప్రతి ఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన రంగువల్లు, నృత్యాలు చూపరులను విశేషంగా అలరించాయి. వారి ఉత్సాహభరిత ప్రదర్శనలకు అతిథులు, తల్లిదండ్రులు చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, బ్రదర్ జెరోమియస్, బ్రదర్ దయాబన్, డాక్టర్ రోజా కిరణ్, డాక్టర్ మాలతి, బాయ్స్ పి ఎల్ రహీం, నూర్జహాన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Ramavaram : క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వికాసం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు